సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్‌లో గాయపడడం సహజంగా జరుగుతుంది.ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ రిస్క్‌లు చేస్తుంటారు. ఈ క్రమంలో గాయాల బారిన పడుతుంటారు.తాజాగా గ్లోమల్ బ్యూటీ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడిందని, ఆమె ముఖంపై రక్తపు మరకలతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముఖంపై రక్తపు మరకలు ఉన్న పిక్స్‌ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, మొదటి ఫోటోలో, ప్రియాంకా చోప్రా ముఖం మట్టితో తడిసి ఉంది. రెండవ ఫోటోలో, ఆమె నుదిటి నుండి రక్తం వస్తుండడం గమనించవచ్చు. కను బొమ్మపై కూడా చిన్న గాయం కనిపిస్తుంది. ఈ పిక్స్ చూసి అభిమానులు తెగ కంగారు పడ్డారు. అయితే ఇవి నిజమైన గాయాలు కావు అని చెప్పిన ప్రియాంక ఫ్యాన్స్ లో కంగారు తగ్గేలా చేసింది.
లండన్ లో ‘సిటాడెల్’ ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో రెండు ఫొటోలు పోస్టు చేసిన ప్రియాంక వాటిలో తనకు తగిలిన గాయం ఎక్కడుందో చెప్పాలని అభిమానులను కోరింది. కొందరు అభిమానులు తప్పుగా సమాధానం చెప్పడంతో, ప్రియాంక కనుబొమ్మపై తగిలిన గాయాన్ని చూపి, అదే నిజమైన గాయం అని వెల్లడించింది.
సిటాడెల్ సెట్స్ కి సంబంధించిన ఫొటోలు వైరల్ కాగా, కనుబొమ్మపై ఎలా గాయమైందని అభిమానులు ప్రియాంకకి కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రియాంక ఈ సిరీస్ కోసం షూటింగ్ చేస్తోంది. ఆమె చాలా రోజుల నుంచి ఈ షూట్ కోసం లండన్‌లో ఉంటున్నారు.