బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరికి ఇంటి నుండి లెటర్స్ రాగా, ఒకరు లేఖను పొందుకునే అవకాశం ఉండగా, మరొకరు వదులుకోవాల్సి వచ్చింది. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో ప్రియాంక, లోబో ఇద్దరూ చర్చించుకున్నారు. ఫస్ట్ టైం మా నాన్న నాకు ఒక లేఖ రాశారు.. అది నాకు చాలా ఇంపార్టెంట్ అని ప్రియాంక చెప్పడంతో లోబో కన్వెన్స్ అయ్యాడు. దీంతో లోబో లెటర్ని మిషన్‌లో వేసి ముక్కలు చేశారు.
ఇక రెండో నామినేషన్ కోసం షణ్ముఖ్-రవిలు ఇద్దరూ సీక్రెట్ రూంకి వెళ్లారు. వీళ్లకి సిరి, విశ్వల ఇంటి వద్ద నుంచి వచ్చిన పోస్ట్ కార్డ్‌లు లభించాయి. తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాఅంటూ విశ్వ ఎమోషనల్ కావడంతో సిరి త్యాగం చేసింది. నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది.
అనంతరం పింకీ- కాజల్‌కు అనీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. అనీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. మానస్ లేఖను ముక్కలు చేస్తున్నందుకు పింకీ చాలా ఫీలైంది. నాలుగో నామినేషన్స్‌లో భాగంగా.. లోబో, విశ్వలు సీక్రెట్ రూంకి వెళ్లగా.. రవి, శ్రీరామ్‌ల ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ వచ్చాయి. అయితే రవి కోసం త్యాగం చేయడానికి శ్రీరామ్ ముందుకొచ్చాడు. లోబో మాటలతో రవి కూడా శ్రీరామ్ కోసం త్యాగం చేయాలని అనుకున్నాడు.ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ తర్వాత రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు.
లేఖ చదివిన తర్వాత శ్రీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది గమనించిన ప్రియాంక అతడి దగ్గరకు వెళ్లి కన్నీళ్లు తుడిచింది. ముద్దుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఆనీ మాస్టర్.. ఇదే వంకతో ముద్దులు పెట్టేసుకుంటున్నావా? అంటూ సెటైర్ వేసింది.
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని