Priyanka Chopra | వయసు మీద పడే కొద్దీ చర్మం మెరుపులు తగ్గడం, ముఖంపై, కళ్ల కింద ముడతలు రావడం సర్వ సాధారణమే. అయితే, సెలబ్రిటీలు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖం యవ్వనంగా, అందంగా కనిపించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. ముఖ్యంగా థెరపీలవైపు మొగ్గు చేపుతుంటారు. ఇప్పుడు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలు సౌందర్యాన్ని సంరక్షించుకునేందుకు అత్యాధునిక రెడ్ ఎల్ఈడీ లైట్ థెరపీ (Red LED Light Therapy)కి మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సైతం ఈ ఎల్ఈడీ థెరఫీని చేసుకున్నారు. తాజాగా ప్రియాంక అమెరికా నుంచి ఇండియాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా 24 గంటల ఫ్లైట్ జర్నీలో కాస్త సమయాన్ని స్కిన్ కేర్ కోసం కేటాయించారు. ఫ్లైట్‌లో రెడ్ ఎల్ఈడీ లైట్ థెరపీ మాస్క్‌తో ముఖాన్ని అందంగా మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ముఖంపై ముడతలు, స్కిన్‌పై మచ్చలను తొలగించి మెరిసే చర్మాన్ని అందించే థెరఫీగా ఈ రెడ్‌లైట్ థెరపీ పేరొంది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సమస్యలు కూడా వెంటాడవని చెబుతుండటంతో సెలబ్రిటీలు ఈ మేనియాతో ఊగిపోతున్నారు. రెడ్‌లైట్ ఎల్ఈడీ థెరపీతో మెరిసిపోయేందుకు బారులు తీరుతున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకునే నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా ఈ బ్యూటీ థెరఫీతో మెరిసిపోతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే. #SSMB29గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక కీ రోల్లో నటిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ త్వరలో అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలోనూ ప్రియాంక చోప్రాని కథానాయికగా తీసుకోబోతున్నారని టాక్. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read..
Bobby Simha | తెలుగు నటుడి కారు బీభత్సం.. వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలు
Samantha | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత
Prabhas -Anushka | ప్రభాస్‌తో అనుష్క క్లోజ్ ఫొటో.. ఇలా తయారయ్యారెందుకు?