Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘శుభం’. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా.. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 09 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ట్రాలాలా బ్యానర్‌పై నిర్మాతగా సామ్ ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా విజయం సాధించాలని తాజాగా సామ్‌తో పాటు చిత్రయూనిట్ అంతా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నేడు ఉదయం తిరుమలకు చేరుకున్న సామ్‌తో పాటు శుభం చిత్రబృందానికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సామ్ క్రిస్టియన్ కావడంతో దర్శనంకి ముందు టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేసిన ఆమె అనంతరం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు.
That last hold to that child 🥺🥰
Devathai ra @Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/9feWv3LYEt— Rupal~∆Sam∆ (@Rupal611045) April 19, 2025