బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా మంగళవారం ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది ప్రియాంక చోప్రా. ‘బాలాజీ ఆశీస్సులతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.
దేవుడి దయతో మనందరం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నా’ అని ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా వుండగా మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ అడ్వెంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుందని, అందుకే ఆమె హైదరాబాద్‌కు విచ్చేసిందని వార్తలొస్తున్నాయి.