Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శనివారం తన న్యూ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. న్యూ మూవీ ది బ్లఫ్‌లో ఆమె బాలీవుడ్ నటుడు, ది బాయ్స్ యాక్టర్ కార్ల్ అర్బన్‌కు జోడీగా నటించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ పోస్ట్‌ను ఆమె తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లోనూ షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ రీషేర్ చేస్తూ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ప్రియాంక పోస్ట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ ప్రియాంకను తన క్వీన్‌గా పేర్కొంటూ నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నా అని రాసుకొచ్చారు.
కార్ల్ అర్బన్‌తో జట్టు కడుతున్నారా ఓ మైగాడ్ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ది బ్లఫ్ మూవీని ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్నాయి. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ ఈ ప్రతిష్టాత్మక మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
Read More :
Tripti Dimri | యానిమల్‌లో ఆ సన్నివేశాలు చూసి అమ్మానాన్న ఇబ్బందిపడ్డారు..: త్రిప్తి డిమ్రీ