Priyanka chopra | స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు. మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ప్రియాంకా చోప్రా వారణాసి షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీబిజీగా గడిపే ఈ భామ కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. షూట్ బ్రేక్ టైంలో ఆదివారం సరదాగా స్విమ్మింగ్ చేసింది. బికినీలో ఓ వైపు హొయలుపోతూ.. మరోవైపు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.లాంగ్ గ్యాప్ తర్వాత హైదరాబాద్‌లో ఇలా కనిపించి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయన్నట్టు ఇప్పటికే ప్రకటించింది టీం. సెకండ్ పార్ట్ 2029లో వస్తుందని వార్తలు రాగా.. రాజమౌళి టీం రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
#PriyankaChopra serves major main character energy as she unwinds by the pool. 🌊#Celebs pic.twitter.com/qQxNFnYZpr
— Filmfare (@filmfare) May 31, 2026