Varanasi | ఎస్ఎస్ రాజమౌళి -మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కీ అప్డేట్ను ప్రియాంకా చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. జర్నీలో ఉన్న ప్రియాంకా చోప్రా ‘వారణాసి బయలుదేరుదాం’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తాజా పోస్ట్‌తో ప్రియాంకా చోప్రా వారణాసి తాజా షెడ్యూల్లో జాయిన్ అయినట్టు అర్థమవుతోంది. షూటింగ్‌కు అవసరమైన నీటి కొరత కారణంగా ఇటీవలే వారణాసి చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంకా చోప్రా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
