Priyanka Chopra | చాలా మందితో డేటింగ్ చేశా.. వారంతా ఎంతో గొప్ప వ్యక్తులు : ప్రియాంక చోప్రా
Priyanka Chopra | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి, గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన గత రిలేషన్షిప్స్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గతంలో చాలా మంది నటులతో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
Priyanka Chopra | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి, గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ హాలీవుడ్ (Hollywood) స్టార్ సింగర్‌ను వివాహం చేసుకుని ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. అయితే, గతంలో బాలీవుడ్ పరిశ్రమలో ఉన్నప్పుడు పలువురు నటులతో పీసీ సంబంధాలు కొనసాగించింది. ఆ విషయాలను ఈ గ్లోబల్ స్టార్ తాజాగా బయటపెట్టింది. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్ ప్రొమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. గతంలో తన రిలేషన్షిప్స్ గురించి నోరువిప్పింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ (ex boyfriends) అంతా చాలా మంచివారని, ఎంతో గొప్పవారని (great wonderful people ) తెలిపింది.
‘నేను గతంలో చాలా మందితో డేటింగ్ (Relationships) చేశా. ఒక బంధం నుంచి మరో బంధానికి మారుతూ వచ్చాను. బంధానికి, బంధానికి మధ్య ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. నా సహచర నటులతో, సెట్లో నాతో కలిసి పనిచేసిన కొందరితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్ షిప్ ఎలా ఉండాలనే దానిపై నాకు ఒక ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను. చాలా గొప్ప వ్యక్తులతో నేను డేటింగ్ చేశాను. నిజమే కొందరితో ఆ బంధాలు విషాదంగా ముగిసి ఉండొచ్చు. కానీ నేను నా జీవితంలో డేటింగ్ చేసిన వారు నిజంగా చాలా మంచి వారు. ఎంతో అద్భుతమైన వ్యక్తులు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
అయితే, నిక్ తన జీవితంలోకి రావడానికి ముందు రెండేళ్లు ఎలాంటి రిలేషన్ షిప్‌లోనూ లేనని వెల్లడించింది. ‘నా భర్త (నిక్ జొనాస్) కంటే ముందు దాదాపు రెండేళ్ల వరకు విరామం తీసుకున్నాను. అప్పుడు ఎలాంటి రిలేషన్లో లేను. అందుకు ఓ పెద్ద కారణం ఉంది’ అని ప్రియాంక స్పష్టం చేసింది. కాగా, ప్రియాంక హాలీవుడ్‌కు వెళ్లకముందు బాలీవుడ్ నటులతో డేటింగ్లో ఉందంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. షాహిద్ కపూర్, హర్మన్ బవేజా, షారుక్ ఖాన్ వంటి స్టార్ నటులతో ప్రియాంక ప్రేమాయణం సాగించిందని బీటౌన్ మొత్తం కోడై కూసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.
Also Read..
Anand Mahindra | నిల్వలు కాదు, రిఫైనింగ్ ముఖ్యం.. లిథియం నిక్షేపాలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Sudha Murthy | నారాయణ మూర్తితో మొదటి పరిచయం అలా జరిగింది.. హ్యాండ్సమ్గా ఉంటారనుకున్నా : సుధామూర్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

