SSMB 29 | మహేశ్ బాబు (Maheshbabu)- గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో రాబోతున్న గ్లోబ్ ట్రోటర్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. జక్కన్న టీం రామోజీఫిలింసిటీలో ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ ఏమై ఉంటుంది.. మహేశ్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది.. ఇంతకీ హీరో పాత్ర పేరేంటి..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం టైటిల్ లాంచ్ ఈవెంట్లో టైటిల్తోపాటే మహేశ్ బాబు పోస్టర్ కూడా బయటకు రాబోతుందట.
నవంబర్ 11న ప్రియాంకా చోప్రా పోస్టర్..!
అయితే ఈ రెండింటి కంటే ముందే హీరోయిన్ ప్రియాంకా చోప్రా లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. తాజా కథనాల ప్రకారం నవంబర్ 11న ప్రియాంకా చోప్రా పోస్టర్, పాత్ర పేరు లాంచ్ చేయబోతుందట జక్కన్న టీం. ఈ క్రేజీ వార్తపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా రాజమౌళి సరికొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడా..? అంటూ చర్చ నడుస్తోంది.
ఇప్పటిదాకా ఏ సినిమా ఈవెంట్‌కు లేని విధంగా ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్లాట్‌ఫాంను 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారట. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Telusu Kada OTT | ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Mirnalini Ravi | డబ్స్మాష్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటి మృణాళిని