Telusu Kada | టాలీవుడ్ యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ ఓటీటీ (OTT) విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో వీక్షించే అవకాశం లభించింది. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమా దక్షిణ భారత భాషలన్నింటిలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యింది. సిద్ధు జొన్నలగడ్డతో పాటు రాశి ఖన్నా మరియు శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వరుణ్(సిద్ధు జొన్నలగడ్డ) అనాధగా పెరిగి, ఆర్ధికంగా ఎదిగిన కుర్రాడు. తనకంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనే కలలుకంటూ ఉంటాడు. ఈ ప్రయత్నంలోనే ఓ అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ కొన్ని కారణాలవల్ల అది బ్రేక్ అప్ అవుతుంది. దాంతో మానసికంగా డిస్ట్రబ్ అవుతాడు. మళ్లీ కొత్త లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అంజలి(రాశీఖన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అంతలో ఊహించని ట్విస్ట్.. అంజలి గర్భసంచిలో సమస్య ఉన్న కారణంగా తను బిడ్డను మోయలేదని డాక్టర్లు తేల్చేస్తారు. కుటుంబం కోసం తపించే వరుణ్ ఈ వార్తను భరించలేకపోతాడు. అంజలి వేరే మార్గాలను అన్వేషించే క్రమంలో డాక్టర్ రాగా(శ్రీనిధి)ని కలుస్తుంది. తమ బిడ్డనే మరొక స్త్రీ గర్భం ద్వారా సరోగసీ విధానంతో పొందవచ్చని తెలుసుకుంటుంది. తమ బిడ్డను మోసేందుకు సహకరించే స్త్రీ కోసం అంజలి అన్వేషిస్తున్న సమయంలో డాక్టర్ రాగా అందుకు ఒప్పుకుంటుంది. నిజానికి ఈ డాక్టర్ రాగా ఎవరో కాదు.. వరుణ్ ఎక్స్ లవర్. తాను చేసిన తప్పును దిద్దుకునేందుకే వరుణ్ బిడ్డను మోసేందుకు అంగీకరిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన బిడ్డను మోసేది తాను ప్రేమించిన అమ్మాయే అని తెలిసిన తర్వాత వరుణ్ రియాక్షన్ ఏంటి? రాగా, వరుణ్‌ల ప్రేమ వ్యవహారం అంజలికి ఎలా తెలిసింది? తెలిశాక పరిణామాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
#TelusuKada (Telugu) streaming from November 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/eReGxDOMid
— OTT Trackers (@OTT_Trackers) November 9, 2025