Priyanka Chopra | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ కల్కి 2పై ఉంది. ఈ చిత్రంలో దీపికాపదుకొనే పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది.
తాజాగా మరో భామ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు ప్రియాంకా చోప్రా. వారణాసి సినిమాతో ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ప్రియాంకా చోప్రా పేరు ఫైనల్ అయినట్టు వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. సినిమాలో జాయిన్ అయ్యేందుక షూటింగ్ టైమ్ లైన్ విషయంలో ప్రియాంకా చోప్రాకు కొన్ని సందేహాలు ఉన్నాయట.
తనకు అనువైన షూటింగ్ టైమింగ్స్ కావాలనుకుంటున్న ప్రియాంకా చోప్రా.. తనతోపాటే కూతురుని కూడా షూటింగ్‌కి తీసుకెళ్లాలనుకుంటుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు దీపికాపదుకొనేకు సమానంగా భారీ రెమ్యునరేషన్‌ను కూడా ఆశిస్తుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మిగితా విషయాలు అటుంచితే ప్రియాంకా చోప్రా రెమ్యునరేషన్ టాపిక్‌పై మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి అవి ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి. ఏదైమైనా ప్రియాంకా చోప్రా టీంలో జాయిన్ అయితే కల్కి 2కు బాగా ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. మరి సీక్వెల్లో ఎవరెవరు కనిపించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు