Priyamani | ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది అందాల తార ప్రియమణి (Priyamani). దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ప్రియమణికి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆమె సినిమాలు, సిరీస్, టీవీ ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. వివాహం అనంతరం ఎదురైన అనుభవాలను పంచుకుంది. మతాంతర వివాహం కారణంగా తాను లవ్ జిహాద్ (Love Jihad) ఆరోపణలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డల గురించి కూడా అనవసరంగా కామెంట్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్ (Mustafa Raj)ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2016లో వీరి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి తనపై విమర్శలు ఎక్కువయ్యాయని ప్రియమణి తెలిపింది. ‘ఎనిమిదేళ్ల క్రితం మా వివాహం అయ్యింది. ఇప్పటికీ మా పెళ్లి విషయంలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. 2016లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఆనందకరమైన విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నా. ఇది తెలిసి అంతా సంతోషిస్తారని అనుకున్నా. బదులుగా నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైంది. లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి.
ఆ ద్వేషం ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. మాకు పిల్లలు పుట్టాక వారు ఐసిస్ (ISIS)లో చేరతారని చెప్పేంత వరకూ వెళ్లింది. ఆ కామెంట్స్ ఎంతగానో బాధించాయి. నేను మీడియా పర్సన్‌ను కాబట్టి విమర్శలను పట్టించుకోను. కానీ నా భర్తపై అలాంటి కామెంట్స్‌తో ఎందుకు దాడి చేస్తున్నారు..? నా భర్త గురించి వివరాలకు కూడా మీకు తెలీవు. కానీ కామెంట్స్ మాత్రం చేసేస్తారు. ఇప్పటికీ నేను నా భర్తతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తే.. పదిలో తొమ్మిది కామెంట్స్ మా పెళ్లి మీదనే ఉంటాయి. వాటి వల్ల బాధపడాల్సి వస్తోంది’ అని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
Govinda divorce rumours | సునీత ఆరు నెలల క్రితం విడాకులకోసం దరఖాస్తు చేసుకున్నారు : లాయర్
Ameesha Patel | అమీషా పటేల్‌కు చేదు అనుభవం.. నటితో ఫోటోల కోసం ఎగబడ్డ సాధువులు
SS Rajamouli | నా చావుకి అతడే కారణం.. వివాదంలో దర్శకుడు రాజమౌళి