Ameesha Patel | బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడిని దర్శించుకునేందుకు ముంబై జుహూలోని ఓ శివాలయానికి వెళ్లారు అమీషా పటేల్. ఇక అమీషా పటేల్ వచ్చిందని తెలిసిన అక్కడి భక్తులు, బాబాలు ఒక్కసారిగా ఆమెని చూసేందుకు ఎగబడ్డారు.
అమీషా ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో అమెతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్‌తో పాటు సాధువులు సైతం పోటీ పడ్డారు. ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఫొటోలు తీసుకున్నారు. అయితే సెల్ఫీల కోసం జనాలు ఎగపడటంతో అమీషా చాలా ఇబ్బంది పడింది. అది గమనించిన టెంపుల్ సెక్యూరిటీ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు. అమీషాతో సెల్ఫీ దిగేందుకు ముందుకు వచ్చిన ఒక సాధువుని అక్కడి నుంచి లాక్కెల్లారు. ఇక బాబా నుంచి తనను రక్షించినందుకు టెంపుల్ సెక్యూరిటీ సిబ్బందికి అమీషా పటేల్ కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది అమీషా పటేల్. సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో అమీషా కథానాయికగా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
హీరోయిన్ అమీషా పటేల్‌తో ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు
మహాశివరాత్రి సందర్భంగా ముంబై – జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు pic.twitter.com/iLeZJd9OfE
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025