SS Rajamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి (S.S. Rajamouli), ఆయన సతీమణి రమా రాజమౌళి(Rama Rajamouli) వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్న స్నేహితుడైన యు.శ్రీనివాస్ రావు(U. Srinivas Rao) రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేయడం సంచలనంగా మారింది.
రాజమౌళిది నాది 34 ఏళ్ళ స్నేహం. ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చెయ్యక ముందు నుంచే మేం ఇద్దరం ఫ్రెండ్స్. ఈ విషయం అందరికి తెలుసు. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నేను చేశాను. కానీ రాజమౌళి జీవితంలో ఒక మహిళ ప్రవేశించడంతో నన్ను దూరం పెట్టారు. ముందు రాజమౌళి..ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు అయితే కెరీర్ బిగినింగ్ టైమ్ లో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశాను. రాజమౌళి వల్లే 54 ఏండ్లుగా బ్యాచిలర్‌గా మిగిలిపోయాను. ఆయన నెంబర్ వన్ అవ్వడం కోసం నా జీవితాన్నే త్యాగం చేశాను. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని.. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు. చివరకి నేను చనిపోయే దాకా తెచ్చాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి రాజమౌళికి రమ రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చెయ్యాలి అంటూ సుసైడ్ నోట్లో రాసుకోచ్చాడు. రాజమౌళి క్షుద్ర విద్యలని వచ్చని.. అతడికి అడ్డుగా వస్తారని అనుకున్న దర్శకులందరనీ పక్కకు తప్పించి తానే నెంబర్ వన్ డైరెక్ట్ అయ్యాడని తెలిపాడు.
రాజమౌళి మరియు ఆయన భార్య రమా టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అంటూ రాజమౌళి స్నేహితుడి సూసైడ్ వీడియో
నేను, రాజమౌళి 34 ఏళ్ల నుండి ఫ్రెండ్స్.. మా మధ్యలోకి రమా వచ్చింది
వీళ్ల కోసం నేను నా లైఫ్ త్యాగం చేశాను.. మధ్యలో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి
ఇవన్నీ నేను బయట ఎక్కడ చెప్తానో… pic.twitter.com/icx5vZk0O7
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025