Priyadarshi | కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన యాక్టర్లలో ఒకడు ప్రియదర్శి (Priyadarshi) . ఇటీవలే సారంగపాణి జాతకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై జాన్వీ నారంగ్ (డెబ్యూ) నిర్మిస్తున్నారు.
ఇవాళ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. చిత్ర సమర్పకుల్లో ఒకడైన రానా దగ్గు బాటి క్లాప్ కొట్టగా.. సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విఛాన్ చేసి ఈ మూవీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్, భరత్ నారంగ్, ఎస్వీఏసీఎల్ఎల్పీ, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేసింది రానా అండ్ టీం. ఈ మూవీకి ప్రేమంటే..? టైటిల్‌ను ఫైనల్ చేశారు.
థ్రిల్ యు ప్రాప్తిరస్థు ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. ఇదే అసలైన ప్రేమకథ… థ్రిల్‌తో అంటూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పాపులర్ యాంకర్ సుమ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ నవనీత్ శ్రీరామ్‌కు కూడా తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రియదర్శి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది.
ఇదే అసలైన ప్రేమకథ… థ్రిల్‌తో 😉
Introducing #Premante? – Thrill-u Praptirasthu 🌟
A unique love story featuring @PriyadarshiPN and @anandiactress, with @ItsSumaKanakala in a key role ❤️🔥
Directed by @NavaneethFilm 🎬
Exciting music by @leon_james 🎵 pic.twitter.com/zy1t7Z33JI— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 19, 2025
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?