Darling | టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను జూలై 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. విడుదల తేదీ దగ్గరపడటంతో మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పెళ్లి చేసుకొని పారిస్‌కి హనీమూన్‌కు వెళ్లాలని గోల్ పెట్టుకున్న యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోగా ఆ యువతికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ (అపరిచితుడు మూవీలో విక్రమ్ లాగా) ఉంటుంది. అయితే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మయిన చేసుకున్న అతడు భార్య చేతిలో కీలు బొమ్మగా ఎలా మారాడు. చివరికి ఏం అయ్యింది అనేది సినిమా స్టోరీ.
పెళ్లి చూపులు, కీడకోలా ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..