Mithra Mandali | ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మిత్రమండలి (Mithra Mandali). ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించాడు.
కామెడీ డ్రామా నేపథ్యంలో వచ్చిన మిత్రమండలి థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఇటీవలే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైం వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
అయితే ప్రియదర్శి టీంలో జోష్ నింపే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మిత్రమండలిపై థియేటర్లలో విపరీతమైన ట్రోల్స్ రాగా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రైమ్ వీడియో ఇండియా చార్ట్స్‌లో మిత్రమండలి ఐదవ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. మేకర్స్ కొన్ని పోర్షన్లు తొలగించి రీఎడిటెడ్ వెర్షన్‌ను డిజిటల్లో విడుదల చేశారు.
మిత్రమండలి మూవీని బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
The Laughter Madness Growing each day..💥💥 #MithraMandali Trending at Top #2 spot on @PrimeVideoIN, with solid response from audience🔥
Streaming Now on Amazon Prime pic.twitter.com/SyIc7gTrA1
— BV Works (@BunnyVasWorks) November 9, 2025
Telusu Kada OTT | ఓటీటీలోకి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Mirnalini Ravi | డబ్స్మాష్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటి మృణాళిని