Mitra Mandali | ‘బలగం’, ‘కోర్టు’, ‘సారంగపాణి జాతకం’ వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రియదర్శి ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన సొంత బ్యానర్ బన్నీ వాస్ వర్క్స్‌ని ప్రారంభించి, దానిలో మొదటి సినిమాగా ఒక కొత్త ఎంటర్టైనర్ను నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి మిత్రమండలి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ఈ మూవీకి సంబంధించి అప్డేట్ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇక ఈ సినిమాను బన్నీ వాస్‌తో పాటు, ‘హాయ్ నాన్న’ ఫేమ్ ఐరా ఎంటర్టైన్మెంట్స్ సప్త అశ్వ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్రను దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించబోతున్నాడు.
Not a Pre-look,
But A Secret Peek 🫣The Faces you might guess,
But the Madness they bring you definitely can’t.#EvaroCheppukondiChuddham 😉Stay tuned.
Title & First look drops June 6th 💥#VijayendarS @BVWorksOffl @saptaaswamedia @VyraEnts @TheBunnyVas @Bhanu_pratapa… pic.twitter.com/DeQHzIkDli— Bunny Vas (@TheBunnyVas) June 4, 2025
Read More