సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా అంటూ బాపుగారి చిత్రంలో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాట తెలియని తెలుగు ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు. అమ్మాయి సౌందర్యాన్ని వర్ణిస్తూ సాగే పాట మాలీవుడ్ భామ ప్రియా వారియర్ (Priya Prakash Varrier) కు సరిగ్గా సరిపోతుంది.ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లో కనిపించే ఈ సుందరి ఇపుడే సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతుంది.
మహారాష్ట్రియన్ సంప్రదాయ చీరకట్టు (Maharashtrian look)లో తళుక్కుమంటోంది. ముదురు గోధుమ రంగు, పింక్ కాంబినేషన్లో స్లీవ్వెస్ బ్లౌజ్లో గోల్డెన్ జరీతో డిజైన్ చేయబడ్డ చీరలో ..తలలో గులాబీ పెట్టుకుని అందానికే అసూయ పుట్టేలే కనిపిస్తోంది. మెడలో వేసుకున్న హారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రియా వారియర్ సంప్రదాయ లుక్‌లో మెరుస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఏడాది ప్రియా వారియర్ నటించిన తెలుగు సినిమాలు ఇష్క్, చెక్ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా (Sridevi Bungalow), కన్నడలో విష్ణు ప్రియ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
3 Roses Web Series | బోల్డ్ కంటెంట్‌ను చూపించడంలో మారుతి సక్సెస్
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?