GenZ Voters | జెన్జీ ఓటు గల్లంతు.. 2024 నుంచి నిలిచిన వార్షిక ఎస్ఎస్ఆర్ ప్రక్రియ
GenZ Voters | 18 ఏండ్లు నిండిన వారిని(జెన్జీ) ఓటర్ల జాబితాలో చేర్చడానికి చేపట్టాల్సిన వార్షిక సవరణ ప్రక్రియ 2024 నుంచి నిలిచిపోవడంపై ఎన్నికల సంఘం(ఈసీ)లో నెలకొన్న అసమ్మతిని కారణంగా ఒక వార్తాకథనం ఎత్తిచూపడంతో కొత్త వివాదం రాజుకుంది.
GenZ Voters | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: 18 ఏండ్లు నిండిన వారిని(జెన్జీ) ఓటర్ల జాబితాలో చేర్చడానికి చేపట్టాల్సిన వార్షిక సవరణ ప్రక్రియ 2024 నుంచి నిలిచిపోవడంపై ఎన్నికల సంఘం(ఈసీ)లో నెలకొన్న అసమ్మతిని కారణంగా ఒక వార్తాకథనం ఎత్తిచూపడంతో కొత్త వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి యువత అంటే భయమని ఆరోపించింది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం 2024 ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితాకు సంబంధించి ఎటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) చేపట్టలేదు.
18 ఏండ్లు నిండిన వారితో సహా కొత్తగా అర్హత సాధించిన ఓటర్లను నమోదు చేసే ప్రక్రియే ఈ ఎస్ఎస్ఆర్. ఈ ఏడాది కూడా 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్ఆర్ గురించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా ఈ ప్రక్రియ మే నెలాఖరులో ప్రకటిస్తారు. ఎన్నికల కమిషనర్లు(ఈసీ) సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే దీనికి కారణమని కథనం పేర్కొంది.

Gen Z Votes
ఎస్ఎస్ఆర్ అంటే ఏమిటి?
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ఒక సమగ్రమైన ప్రక్రియ కాగా ఎస్ఎస్ఆర్ అనేది ఓటర్ల బాబితాలను నవీకరించడానికి, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను చేర్చడానికి చేపట్టే ఒక సాధారణ వార్షిక ప్రక్రియ. 18 ఏండ్లు నిండిన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ఎస్ఎస్ఆర్ ఒక కీలకమైన విధానం. ఈ ప్రక్రియ ద్వారా ఒక నిర్దిష్ట సంవత్సరంలో 18 ఏండ్లు నిండబోయే వారు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అనే నాలుగు తేదీల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆ సంవత్సరంలోనే 18 ఏండ్లు నిండే వ్యక్తి దరఖాస్తు చేసుకోవడానికి తదుపరి జనవరి వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఈసీఐ వెబ్సైట్ను పరిశీలిస్తే చివరిగా ఎస్ఎస్ఆర్ ప్రక్రియ 2024లో జరిగిందని తెలుస్తుంది. 2025లో బీహార్లో సర్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరించారు. దీనివల్ల 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం తప్పనిసరి అయిన రాష్ర్టాలవ్యాప్తంగా ఏటా ఎస్ఎస్ఆర్ నిర్వహించాలనే దశాబ్దాల నాటి సంప్రదాయానికి విఘాతం కలిగింది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం సర్ ప్రక్రియ మధ్యలో ఎస్ఎస్ఆర్ అవసరమా అనే విషయంపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ న్యాయపరమైన సలహా కూడా తీసుకున్నారు.
ఎస్ఎస్ఆర్ ప్రక్రియను బలంగా సమర్థిస్తూ దానిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి నొక్కిచెప్పినప్పటికీ సీఈసీ చొరవ చూపలేదు. ప్రతి ఏటా 18 ఏండ్లు నిండే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడం అవసరమని ఆ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేశారని వార్తా కథనం పేర్కొంది. వార్షిక ఎస్ఎస్ఆర్ ప్రక్రియను సర్ పూర్తిగా భర్తీ చేయరాదని కూడా వారిద్దరూ వాదించారు. 2024 నుంచి ఎస్ఎస్ఆర్ ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది మంది జెన్జీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
విపక్షాలకు కొత్త అస్త్రం
మోదీ ప్రభుత్వానికి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న విస్తృత ఓట్ చోరీ ప్రచారానికి ఈ నివేదికలోని అంశాలను ముడిపెట్టడానికి ఇది వారికి ఆయుధాన్ని అందించింది. 2029 లోక్సభ ఎన్నికల నాటికి జెన్జీ దేశంలోని అతిపెద్ద ఓటర్ల సమూహాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించలేని ఒక శక్తివంతమైన ఎన్నికల వర్గంగా మారనున్నది. టైమ్స్ కథనంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందిస్తూ జెన్జీ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం, సీఈసీ కుట్ర పన్నాయని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

