Simba is Coming | హనుమాన్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో తెలుగు సినిమా సత్తా చాటాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నందమూరి మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాడని తెలిసిందే. ప్రశాంత్ వర్మ నెట్టింట ఓ ఫొటోను షేర్ చేస్తూ.. చాలెంజ్ స్వీకరించబడిందని సస్పెన్స్ ట్వీట్ చేయగా.. ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ వెనుకున్న సీక్రెట్ ఏమై ఉంటుందా..? అని చర్చలో మునిగిపోయారు సినీ జనాలు.
ది లయన్ కింగ్‌లోని ఓ ఫొటోను షేర్ చేస్తూ #SimbaisComingను జోడించాడు. ప్రశాంత్ వర్మ విషయం డైరెక్టుగా చెప్పనప్పటికీ.. సింబా ఇంకెవరో కాదు.. మోక్షజ్ఞనేనంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. తాజా టాక్ ప్రకారం సెప్టెంబర్ 6న ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాప్ స్టార్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనుందట ప్రశాంత్ వర్మ టీం.
చాలా ఏండ్లుగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు మరి సెప్టెంబర్ 6తోనైనా క్లారిటీ ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే డెబ్యూ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో చేస్తుండటం గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు.
A new dawn is breaking at @ThePVCU!#SimbaisComing 🦁 pic.twitter.com/Kr91AkRil2
— Prasanth Varma (@PrasanthVarma) September 3, 2024