Pranitha Subhash | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు వివాదం అని చెప్పకతప్పదు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల నూనెలను వాడారని వచ్చిన నివేదికలు భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. పవిత్రమైన తిరుపతి శ్రీవారి లడ్డూను కల్తీ చేయడంతో మహా పాపానికి పాల్పడిన నీచులను శిక్షించాలని భక్తులతో పాటు నెటిజన్లు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ నటించిన అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా తాజాగా ఎక్స్ వేదికగా స్పందించింది.
శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగిస్తున్నారనే వార్తలు వస్తుండటం చాలా భాదాకరం. శ్రీవారి విషయంలో ఇలా జరగడం ఎంతో దారుణంగా ఉంది. ఇలాంటి పని చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు నిజంగా కలలో కూడా ఊహించలేని పరిణామం అంటూ ప్రణీత సుభాష్ రాసుకోచ్చింది.
News of animal fats being used in the preparation of Srivari laddu is nothing short of sacrilege. I hope the strictest action will be ensured against the perpetrators.
This is unimaginable to Sri Venkateswara bhaktas!
— Pranitha Subhash (@pranitasubhash) September 19, 2024
మరోవైపు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈ ఘటనపై తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
Also Read..