మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజులలో జరగనున్న ఈ ఎలక్షన్స్‌లో ఈ సారి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశాడు ప్రకాశ్ రాజ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. వాటిని సాల్వ్ చేయడానికి నా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది.
ఇతర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాలలో టాలీవుడ్ పరిశ్రమ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే ఒకవేళ నేను అధ్యక్షుడిని అయితే, 100 శాతం సొంత భవనం కూడా నిర్మిస్తాను అంటూ ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారు. చిరంజీవి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నారట అన్న ప్రశ్నకు.. ‘చిరంజీవి అందరి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయన ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని అనిపించిన వారికే మద్దతు ఇస్తారు. అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీని కోసం ఉపయోగించుకోను’’ అని ప్రకాశ్‌రాజ్ బదులిచ్చారు.