Ram Gopal Varma | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఘటనలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో వర్మ మీద కేసులు కూడా నమోదయ్యాయి.
ఇప్పటికే ఈ వ్యవహారంలో రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్మపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. తాజాగా ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 7న విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి ఆర్జీవీ స్పందిస్తూ విచారణకు హాజరవుతానన్నారు. నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర..
గతంలో పోలీసుల నోటీసుల నేపథ్యంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ..నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా. నాపై ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు.
ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా? ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేయగా.. ఇప్పటికే ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్