Praksh Raj | తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరుగక ముందే కల్తీ జరిగిందంటూ చేసిన ప్రకటన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని.. దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. లడ్డూలో నాణ్యత లోపం ఉందని భక్తులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను పరిశీలించి టెస్టింగ్‌కు పంపించారని ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా కల్తీ జరిగిందని గుర్తించారని చెప్పగా.. ఏదైనా అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత, తయారైన లడ్డూలను టెస్టింగ్‌కి పంపారా? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? ప్రశ్నించింది. మైసూర్, గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదుని, నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా గురువారానికి వాయిదా వేసింది. తాజాగా సుప్రీంకోర్ట వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా లడ్డూల వ్యవహారంపై స్పందించారు. సుప్రీంకోర్టు ఫొటోలతోపాటు బాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్న క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ ‘దేవున్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్టిస్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇప్పటికే ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. లడ్డూల వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, కార్తీపై సైతం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ తప్పు చేయకుండానే క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ సెటైరికల్‌గా స్పందించారు. ఆ తర్వాత ‘గెలిచే ముందు ఓ అవతారం.. గెలిచాక మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం’ పోస్ట్ పెట్టారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పును నేపథ్యంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు.
దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿
జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun
— Prakash Raj (@prakashraaj) September 30, 2024