Prakash Raj | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ఖండించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వీడియో విడుదల చేస్తూ.. పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పటి నుంచి వరుసగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి.. జస్ట్ ఆస్కింగ్ పేరుతూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఆయన మరోసారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ !.. కదా?.. ఇక చాలు.. ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అంటూ పవన్‌పై సెటర్లు వేశారు. వాస్తవానికి పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. లడ్డూ వ్యవహారం ట్విట్టర్ వేదిక ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలపై సైతం మండిపడగా.. కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పాడు. క్షమాపణల ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘తప్పు చేయకుండానే క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో’ పవన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత ‘గెలిచే ముందు ఓ అవతారం.. గెలిచాక మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం’ ట్వీట్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఫొటోలతోపాటు బాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్న క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ ‘దేవున్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్టిస్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండానే ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు మండిపడుతున్నారు.