Prakash Raj | జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా గట్టి డిమాండ్ వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత్‌పై దాడికి పాల్పడినవారికి తగిన రీతిలో బదులివ్వడానికి సైన్యంతో కలిసి పనిచేయడం తన బాధ్యత అంటూ రీసెంట్గా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీంతో త్వరలోనే పాక్‌కి భారత్ గట్టి గుణపాఠం చెప్పనుందని ముచ్చటించుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు బీజేపీకి వ్యతిరేఖంగా మాట్లాడే ప్రకాశ్ రాజ్ కొన్ని సార్లు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ విమర్శల బారిన పడుతుంటాడు. ఈక్రమంలోనే ఈ స్టార్ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది.
పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను అన్ని రకాలుగా బాన్ చేసింది. ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాటు, వారికి ఇండియా నుంచి రావల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానెల్స్, సోషల మీడియా, సినిమాలు ఇలా అన్నింటిని బ్యాన్ చేసింది. పాకిస్తానీయులని కూడా ఈ దేశం నుండి పంపేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పాకీస్తాని నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం , వారి సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్.. పాక్ హీరో సినిమా రిలీజ్ ను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు.
పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేదించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ముందు సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది. రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్. ఆయన పాక్ నటులకి సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. కాగా, పహల్గాం దాడి తరువాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాశ్ రాజ్ సుదీర్ఘమైన నోట్ విడుదల చేశారు. ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నాచేయరు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించవద్దు అంటూ పాకిస్తాన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.