Prakash Raj | బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఓ గ్రామానికి షూటింగ్ కోసం వచ్చానన్నారు. ఆన్లైన్ గేమింగ్ యాప్ కేసులు, తాను చేసిన యాడ్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాలి కదా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని అందరూ తనను ప్రశ్నిస్తున్నారన్నారు. 2016లో ఆ యాడ్ తన వద్దకు వచ్చిందని.. ఆ యాడ్ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆ యాడ్ చేయడం తప్పని కొద్దినెలల్లోనే తెలుసుకున్నానన్నారు. ఏడాది కోసం అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి వెంటనే ఆపాలని ఆ కంపెనీకి చెప్పలేకపోయానని.. 2017లో అగ్రిమెంట్ పొడిగిస్తామంటే.. ఆ యాడ్‌ను ప్రసారం చేయొద్దని కోరానన్నారు. ఆ తర్వాత మళ్లీ ఏ గేమింగ్ యాప్‌లకు యాడ్స్ చేయలేదన్నారు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మివేశారని.. ఏదో సోషల్ మీడియాలో తాను చేసిన ప్రకటన వాడారని.. అది తెలిసి లీగల్ నోటీసులు పంపానన్నారు.
My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls
— Prakash Raj (@prakashraaj) March 20, 2025
ఆ ప్రకటన తొలగించాలని వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే.. వెంటనే నిలిపివేశారన్నారు. ఆ యాడ్ మళ్లీ ఇప్పుడు లీక్ అయ్యిందని.. అందుకే స్పందిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి సందేశం రాలేదన్న ప్రకాశ్‌రాజ్.. ఈ విషయంలో పోలీసులకు వివరణ ఇస్తానన్నారు. తొమ్మిదేళ్ల కింద యాడ్ చేస్తున్నానని.. ఏడాది కాంట్రాక్ట్ కోసం పని చేసిన మాట వాస్తవమేనని.. ఈ విషయంలో ప్రజలకు సమాధానం ఇస్తున్నానన్నారు. అందరికీ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నానని.. గేమింగ్ యాప్‌లు ఓ వ్యసనమని.. యువత వాటికి దూరంగా ఉండాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ టీమ్ సైతం స్పందించింది. చట్ట ప్రకారమే ఓ యాప్‌కి ప్రచారం చేసినట్లు తెలిపారు.
My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls
— Prakash Raj (@prakashraaj) March 20, 2025