Dragon | లవ్ టుడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (Dragon).. ఓ మై కడవులే ఫేం అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. డ్రాగన్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది ప్రదీప్ రంగనాథన్ టీం. ప్రదీప్ రంగనాథన్ ఇంజినీరింగ్ కాలేజ్ బస్‌పైకి ఎక్కి చేతిలో గ్యాస్ సిలిండర్ పట్టుకున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌లో ప్రదీప్ రంగనాథన్ ఓ చేతిలో బుక్ పట్టుకుని.. మరో చేత్తో సిగరెట్ వెలిగిస్తూ లైబ్రరీలో నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. వెనుక మంటలు కనిపించడం చూడొచ్చు.
కొన్ని సార్లు కాలేజీ స్టూడెంట్స్ అటెన్షన్, పాపులారిటీకి ఎలా బానిసలవుతారనే దాని చుట్టూ సినిమా ఉంటుందని డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చెప్పాడు. డ్రాగన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో పాపులారిటీ ఉన్న విద్యార్థి రాఘవన్ గురించి ఉంటుంది. 2016 నుంచి 2025 వరకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ అండ్ కవర్స్‌లో నా అనుభవాలను స్పూర్తిగా తీసుకుని వస్తున్న సినిమా అని చెప్పుకొచ్చాడు అశ్వత్ మారిముత్తు.
డ్రాగన్ ట్రైలర్ టైం..
#Dragon trailer
10th Feb 5PM pic.twitter.com/kFchRp1EA6— Pradeep Ranganathan (@pradeeponelife) February 9, 2025