Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja Saab). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ టాక్ షోలో ఈ ప్రాజెక్ట్ గురించి మాళవిక మోహనన్ ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
రాజాసాబ్ షూటింగ్ పూర్తయే దశలో ఉంది. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ జోనర్లో రాబోతున్న హార్రర్ సినిమా. ప్రభాస్ సార్‌తో ఈ సినిమా చేయడం ఎక్జయిటింగ్‌గా ఉంది. ఆయన చాలా ఫన్నీ అండ్ జోవియల్‌గా సాగే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సారి ప్రేక్షకులు ప్రభాస్‌ను కొత్తగా చూడబోతున్నారని చెప్పింది మాళవిక మోహనన్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
నవంబర్ కల్లా రాజాసాబ్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మారుతి టీం విడుదల చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న విజువల్స్ అభిమానులను విజువల్ ట్రీట్ అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
చిట్ చాట్‌లో ఏం చెప్పిందంటే..?
We’re almost done with shoot of #TheRajaSaab and it’s releasing in April. It’s light hearted romantic comedy horror films. I’m very excited it’s with #Prabhas sir. He’s playing a funny jovial role so it’ll be different for audience too seeing him♥️ – #MalavikaMohanan pic.twitter.com/ohIivSqDDT
— prabhas (@salaarthesega81) October 3, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3