Raja Saab | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో మలయాళ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా లాంచ్ చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది.
అయితే ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చాలా కాలంగా డైలామాలో ఉన్నారు అభిమానులు. ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఫైనల్‌గా వచ్చేసింది. రెబల్ స్టార్ స్టైల్.. స్వాగ్.. ఎంట్రీ లెవల్ అంటూ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. కామిక్ టచ్‌తో భయపెట్టిస్తూ.. థ్రిల్ అందించేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
Rebels & Darlings Get Ready For #Prabhas #TheRajaSaab 1st Single Update Tomorrow At 12 noon ! #TheRajaSaabOnJan9th 🔥🔥 pic.twitter.com/3ZXFDalDQV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 20, 2025
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!