Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న చిత్రం రాజాసాబ్ (raja saab). మారుతి డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. సినిమా షూటింగ్‌కు సంబంధించి అభిమానుల్లో నెలకొన్న డైలామాకు చెక్ పెట్టాడు మారుతి. ఈ డైరెక్టర్ బచ్చలమల్లి ప్రమోషనల్ ఈవెంట్లో రాజాసాబ్ షూటింగ్ పూర్తయిందని క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే రాజాసాబ్ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి మూవీ లవర్స్‌ను నిరాశ చెందేలా చేస్తుంది. రాజాసాబ్ విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తుండగా.. మరోవైపు మీరు ఏ డేట్‌కు చూడాలనుకుంటే బాగుంటదో అదే తేదీన రాజాసాబ్ వస్తుందని మారుతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాజాసాబ్ విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. అంతేకాదు రాజాసాబ్ టీజర్ రన్‌టైం 2 నిమిషాల 15 సెకన్లు అని ఇన్సైడ్ టాక్.
రాజాసాబ్ మోషన్ పోస్టర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో మలబారు సోయగం మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?