Raja saab | 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిలిచిపోయిన షూటింగ్స్ మళ్లీ ఊపందుకుంటున్నాయి. షూటింగ్ షురూ చేసిన చిత్రాల్లో మోస్ట్ ఎవెయిటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab) ఉండటం ఓ వైపు ప్రభాస్ (Prabhas) అభిమానులతోపాటు మరోవైపు మూవీ లవర్స్‌కు కూడా పండగే అని చెప్పాలి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో రీస్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్‌తోపాటు ఇతర యాక్టర్లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని ఇన్సైడ్ టాక్. ఈ నెల చివరి వరకు తాజా షెడ్యూల్ ఉండనుందట. అంతేకాదు నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 17 నుంచి కేరళలో ఉండనుండగా.. ఇందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
అనంతరం ప్రభాస్ అండ్ మారుతి టీం రెండు పాటల షూట్ కోసం విదేశాలకు వెళ్లనుండగా.. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ ముగియనుందట. మొత్తానికి ప్రభాస్ తన అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు జెట్‌స్పీడ్‌లో రాజాసాబ్‌ను పూర్తి చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా కథనం హింట్ ఇచ్చేస్తుంది.
2025 డిసెంబర్లో రావాల్సిన ఈ చిత్రం 2026 జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్నఈ మూవీలో మలబారు భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
Tollywood | కూలీ, వార్ 2 చిత్రాలు ఆ చిన్న సినిమా ముందు తేలిపోయాయా.. ఇది కదా సక్సెస్ అంటే..
Pawan Kalyan | బాలకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..!
Chiranjeevi | మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. ఏపీ సీఎంని కలిసి మరి..