ప్రభాస్ అభిమానులకిది నిజంగా శుభవార్తే. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ‘ది రాజా సాబ్’ చిత్ర విడుదల తేదీని మంగళవారం మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 16న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలు. డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో ప్రభాస్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటివరకూ చేయని రొమాంటిక్ హారర్ జోనర్ కావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి రెట్టింపయ్యింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.