Raja Saab | మారుతి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమా రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తున్న రాజాసాబ్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. సినిమా వాయిదా పడనుందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ పుకార్లపై రాజాసాబ్ టీం పరోక్షంగా హింట్ ఇచ్చేసినట్టేనని అర్థమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రభాస్ టీం సంక్రాంతి శుభాకాంక్షలతో దాదాపు క్లారిటీ ఇచ్చేసింది. డార్లింగ్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు.. మనం ఎపుడు వస్తే అప్పుడే అసలైన పండగ. త్వరలో చితక్కొట్టేద్దాం. రాజాసాబ్ త్వరలోనే థియేటర్లలో మిమ్మల్ని కలుస్తాడు.. విడుదల చేసిన పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ పోస్టర్లో విడుదల తేదీని చూపించకపోవడంతో సినిమా పాత తేదీన రావడం లేదని క్లారిటీ వచ్చేసినట్టైంది. మరి రాజాసాబ్ ఎప్పుడొస్తాడో.. అభిమానులకు పండుగ ఎప్పుడుంటుందోనని ఆసక్తికంగా మారింది.
Happy Sankranthi Darlings ❤️
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?