Prabhas Project-k movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ మధ్య చిన్న సర్జరి కారణంగా ప్రభాస్ షూటింగ్‌లకు విరామం ఇచ్చాడు. తాజాగా ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని సాధించింది. పిరీయాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా లవర్‌బాయ్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్-K’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మహాభారతం నుంచి స్పూర్తి తీసుకున్నట్లు తెలుస్తుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలను బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. అయితే ప్రాజెక్ట్-K లోని K అంటే కల్కి అని , మహాభారతంలో విష్ణుమూర్తి కల్కి అవతారన్ని బేస్ చేసుకుని ప్రభాస్ పాత్ర ఉండనుందని సమాచారం. ఇక మహాభారతంలో మరో ప్రధాన పాత్ర అశ్వథ్థామను బేస్ చేసుకుని అమితాబ్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది. విష్ణు మూర్తి కలియుగంలో కల్కిగా అవతారంచబోతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్రోణుడి కొడుకు అయిన అశ్వథ్థామ చిరంజీవి. అంటే ఈయనకు అసలు చావు ఉండదు. ఈ రెండు పాత్రలను బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దీపికా పదుకొనే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Srikanth Meka | విలన్‌గా బిజీ అవుతున్న సీనియర్ హీరో శ్రీకాంత్