Prabhas | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas). ఇప్పటికే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను లైన్లో పెట్టాడు. మరోవైపు హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా చేస్తున్నాడు. 2024లో వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ప్రభాస్.. 2025లో కూడా ఇదే ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడా..? అంటే తాజా వార్త ఒకటి అవుననే హింట్ ఇచ్చేస్తుంది.
తాజా టాక్ ప్రకారం ప్రభాస్ 2025 ప్రారంభంలో కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడట. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం.
శాండల్‌వుడ్‌లో ఉన్న మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీల్లో ఒకడైన రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రభాస్ సినిమా కోసం కథనందించబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుందని వార్తలు రావడంతో.. మరి ఈ సినిమా అదేనా..? అంటూ జోరుగా చర్చ మొదలైంది. ఈ ఎక్జయిటింగ్ గాసిప్‌పై న్యూఇయర్‌లో ఏదైనా అధికారిక ప్రకటన చేస్తాడా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాతోపాటు కాంతార చాప్టర్ 1 (ప్రీక్వెల్)లో నటిస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!