Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంపౌండ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో టాక్ ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. కల్కి 2898 ఏడీ తొలి రోజే నైజాంలో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డు బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్లు రూ.23.55 కోట్లు రాబట్టగా.. కల్కి 2898 ఏడీ రూ.24 కోట్లతో ఆ రికార్డును అధిగమించింది.
ఈ చిత్రంపై ఇప్పటికే మూవీ లవర్స్‌తోపాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కల్కి 2898 ఏడీ ఫస్ట్ వీక్‌లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వసూళ్లు రూ.900 కోట్లు దాటాయి. వైజయంతీ మూవీస్ ఓ ఫొటోను షేర్ చేసింది. షూట్‌కు ముందు లొకేషన్లో ఓ సీన్ ప్రాక్టీస్ సెషన్లో ఉన్నప్పుడు క్లిక్‌మనిపించిన స్టిల్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది వైజయంతీ మూవీస్. ఇప్పుడీ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
While the epic was loading… #Kalki2898AD #Prabhas @nagashwin7 pic.twitter.com/FnOJ4mEjAc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 11, 2024
Shankar | కమల్ హాసన్ ఇండియన్ 2 ఎండింగ్లో సర్ప్రైజ్.. శంకర్ ఏం ప్లాన్ చేశాడో మరి.. ?
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Trisha | అజిత్‌కుమార్, త్రిష టీంతో వెంకట్ ప్రభు.. స్పెషలేంటో మరి..!