Trisha | స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu).. స్టార్ యాక్టర్ అజిత్ కుమార్.. స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) ముగ్గురూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న వీరంతా ఒక్క చోట చేరితే ఎలా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ వీరంతా ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. అజర్‌బైజాన్‌లోని బకులో Vidaa Muyarchi షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు అజిత్ కుమార్, త్రిషను కలిశాడు వెంకట్ ప్రభు. ఈ క్రేజీ డైరెక్టర్ వారితో సరదా చిట్ చాట్ చేసిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వీళ్లంతా ఇలా ఒక్క చోట చేరడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది.
వెంకట్ ప్రభు ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ది గోట్ (The Greatest Of All Time) సినిమా తెరకెక్కిస్తున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తు్న్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవలే మాస్కోలో కొనసాగుతున్న యాక్షన్ షెడ్యూల్ గురించి అప్డేట్ కూడా ఇచ్చేశాడీ దర్శకుడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ది గోట్లో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ , ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఏకే 62గా తెరకెక్కుతున్న విడాముయార్చిలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు
#AK , @trishtrashers , Team #VidaaMuyarchi with Dir @vp_offl in Azerbaijan 🇦🇿 pic.twitter.com/HoAvh0cLN0
— Ramesh Bala (@rameshlaus) July 11, 2024
⭐#VenkatPrabhu meets #Ajithkumar and the #VidaaMuyarchi💥❣️Team @ Baku, Azerbaijan.#AK #AK63 #TheGOAT #Trisha #TrishaKrishnan pic.twitter.com/qSZ2cwJa5B
— Sandy (@SMD_Tweets) July 11, 2024