టాలీవుడ్లో మారుతి (Maruthi)-ప్రభాస్ (Prabhas) క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇప్పటికే లాంఛ్ అయింది. కాగా చాలా రోజుల తర్వాత ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమా లాంఛింగ్ ఎంత సీక్రెట్‌గా జరిగిందో.. అంతే సీక్రెట్‌గా చిత్రీకరణ కూడా మొదలైందని తాజా టాక్.
ఫిలింనగర్లో రౌండప్ చేస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతుందట. ప్రస్తుతం కొనసాగుతున్న షూటింగ్ గురించి మీడియాకు చెప్పొద్దని ప్రభాస్ మేకర్స్ కు సూచించినట్టు ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌనగా మారింది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఇప్పటికే మూడు రోజులపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడట ప్రభాస్.
మొత్తానికి ఈ అప్డేట్తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉండగా.. ఆదిపురుష్ విడుదలకు రెడీ అవుతోంది.
Read Also : Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యామిలీ ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Also : Sudheer Babu | ఇన్‌ల్యాండ్ లెటర్‌తో సుధీర్ బాబు కొత్త సినిమా పోస్టర్.. వివరాలివే
Read Also : Lokesh Kanagaraj | ఒకేసారి దళపతి 67, ఖైదీ 2 అప్డేట్స్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్