Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా సిల్వర్ స్క్రీన్‌పై రికార్డు వర్షం కురిపించిన ఈ మూవీ ఇక టీవీలో సందడి చేసేందుకు రెడీ అయింది.
కల్కి 2898 ఏడీ సంక్రాంతి కానుకగా టీవీలో సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 12న జీ తెలుగులో సాయంత్రం 5:30 గంటలకు టెలివిజన్ ప్రీమియర్ కానుంది. ప్రభాస్ అభిమానులు టీఆర్పీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని తెలుసుకునేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా తన వాహ చూపిస్తోంది.
కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం నేడు జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Boys before destruction 💥🔥#Kalki2898AD Coming soon on @ZeeTvTelugu#WorldTelevisionPremiereKalki2898AD#Kalki2898ADOnZeeTelugu@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/3Di4uWJIlV
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 2, 2025
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!