ప్రభాస్‌కు 24 గంటలూ అదే ధ్యాస అంటోన్న భాగ్యశ్రీ
ప్రభాస్ ఎలా ఉంటాడనేది తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈయన బిహేవియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ప్రభాస్ ఎలా ఉంటాడనేది తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈయన బిహేవియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారి ప్రభాస్ కు కనెక్ట్ అయితే డిస్ కనెక్ట్ అవ్వడం ఈజీ కాదు. ఎవరైనా కూడా అంత బాగా కనెక్ట్ అయిపోతారు ఈయనతో. ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో మరో ఫ్రెండ్ కూడా చేరిపోయింది. ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాతో ఇండియాను ఒక ఊపు ఊపిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగానే ఉన్న ఈమె.. ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో అతడి తల్లిగా నటిస్తుంది భాగ్య శ్రీ. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ బిహేవియర్ గురించి తెలుసుకుని షాక్ అయింది భాగ్య శ్రీ. మరీ ముఖ్యంగా అంత పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే టెన్షన్ పడ్డానని.. కానీ ప్రభాస్ ఎంత కూల్ అని తెలిసిన తర్వాత అతడికి ఫిదా అయిపోయానంటుంది ఈ సీనియర్ హీరోయిన్. అంత పెద్ద హీరో సెట్లో ఉన్న విధానం చూసి ప్రభాస్ ఫ్యాన్ అయిపోయాను అంటుంది భాగ్యశ్రీ. మరోవైపు ఆయనకు 24 గంటలు ఒకే పిచ్చి ఉంటుందని.. అదే ఫుడ్ అంటుంది ఈమె. తిండి విషయంలో ప్రభాస్ అందరికంటే ఓ మెట్టు పైనే ఉంటాడని.. ఎప్పుడు చూడూ సెట్స్ లో ఫుడ్ ఐటమ్స్ గురించే చర్చించే వాడని.. గంటల తరబడి ప్రభాస్ నోటి నుంచి ఫుడ్ గురించి తప్ప మరో విషయమే రాదని చెప్పుకొచ్చింది భాగ్య శ్రీ.
ఆయన తినడమే కాదు.. సెట్ లో అందరికీ తినిపించే వాడని.. ఇంటి నుంచి యిష్టమైన ఫుడ్స్ అన్నీ వండించి మరీ తీసుకొచ్చేవాడని చెప్పింది భాగ్య శ్రీ. ప్రభాస్‌తో షూటింగ్ చేసిన ఆ కొన్ని రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని.. ఎంతో ఎంజాయ్ చేశామని చెబుతుంది ఈమె. అంత ఫుడ్ తిన్నా కూడా.. ఫిట్ నెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాడని తెలిపింది ఈ సీనియర్ హీరోయిన్. ఈ మధ్యే స్పెషల్ పూతరేకులు భాగ్య శ్రీ కోసం పంపించాడు ప్రభాస్. తెలుగు ఫుడ్స్ తనకు పూర్తిగా అలవాటు చేసాడు.. ఫుడ్ విషయంలో తాను కూడా పిచ్చిదాన్ని అయిపోయానంటూ సరదాగా కామెంట్ చేసింది భాగ్య శ్రీ.
ఇవి కూడా చదవండి..
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్‌లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

