Purushaha | టైటిల్‌తోనే ప్రేక్షకుల అటెన్సన్ను తనవైపునకు తిప్పుకుంటున్న చిత్రం పురుష (Purushaha). ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది.. అంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు . వీరు వులవల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ లుక్ విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ గ్లౌస్ మధ్య సప్తగిరి నలిగిపోతున్నట్టు ఉన్నతాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. పాపం అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ పురు చిత్రంపై అంచనాలు పెంచేస్తుంది.
ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తున్నారు. బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధ భూమిగా మారుతుంది.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్ యుద్ద వీరుడి గెటప్‌లో కనిపిస్తుంటే.. కసిరెడ్డి కసిరెడ్డి రాజ్‌కుమార్ స్పైడర్ మ్యాన్‌గా, సప్తగిరి దేవదూతను తలపించే గెటప్‌లో కనిపిస్తున్నారు.
ఒకరి డ్రెస్‌పై ఎగిరి పక్షి బొమ్మ కనిపిస్తుంటే.. మరొకరి చాతిపై లవ్ సింబర్.. ఇంకొకరిపై కత్తెర సింబల్ కనిపిస్తున్నాయి. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న వస్తోన్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
💥 Power Has a New Face 💥
Gloves on. Spine straight. Eyes locked.
When she steps in, resistance doesn’t survive.Female dominance reigns supreme in #Purushaha
పాపం అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ
The punch lands before the fight even begins. 🥊💪@kalyanb949 @urvaishukrish… pic.twitter.com/1kP3Xpyz46
— BA Raju’s Team (@baraju_SuperHit) December 30, 2025
Tollywood 2025 | 2025 రౌండప్.. హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలివే..!
Raja Saab | ఏంటీ రాజాసాబ్ క్లైమాక్సే అంతసేపు ఉందా..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్