Dharmendra | 2025 సంవత్సరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక చీకటి సంవత్సరంగా మిగిలిపోయింది. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన మహానటుల నుంచి అద్భుతమైన గాయనీ గాయకుల వరకు ఎంతోమంది ఈ ఏడాది భౌతికంగా మనకు దూరమయ్యారు. అయితే ఈ ఏడాది కాలం విడిచిన ప్రముఖులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
ధర్మేంద్ర (Dharmendra)

Dharmendra
బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ గా పేరుగాంచిన లెజెండరీ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24, 2025న తన 89వ ఏట కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సుమారు 300 పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా రెండు కోణాల్లోనూ రాణించాడు.
షెఫాలి జరివాలా (Shefali Jariwala)

Shefali Jariwala
ప్రముఖ నటి, ‘కాంటా లగా’ గర్ల్ షెఫాలి జరివాలా జూన్ 27, 2025న 42 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూజ కారణంగా ఆమె ఉపవాసం ఉండటం, ఖాళీ కడుపుతో కొన్ని మందులు తీసుకోవడం వల్ల రక్తపోటు (BP) ఒక్కసారిగా పడిపోయి ఆమె కుప్పకూలిపోయారు. 2000వ దశకం ప్రారంభంలో ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోతో సంచలనం సృష్టించిన ఆమె, ఆ తర్వాత పలు రియాలిటీ షోలలో (బిగ్ బాస్ వంటివి) చురుగ్గా పాల్గొన్నారు.
జుబీన్ గార్గ్ (Zubeen Garg)

Zubeen Garg
అస్సామీ మరియు బాలీవుడ్ (యూ అలీ సాంగ్ ఫేమ్) గాయకుడు జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19, 2025న సింగపూర్‌లో మరణించారు. ఒక స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఆయన అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. హిందీలో ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలోని యా అలీ పాట ఆయనను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది.
కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)

Kota Srinivasarao
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఈ ఏడాదే మరణించారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు.
బి. సరోజా దేవి (B. Saroja Devi)

Saroja Devi
అలనాటి మేటి నటి, అభినయ సరస్వతిగా పేరొందిన బి. సరోజా దేవి జూలై 14, 2025న బెంగళూరులో మరణించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆమె ఒక వెలుగు వెలిగారు.
ఇంకా వీరే కాకుండా.. దివంగత ప్రముఖలు
విష్ణు ప్రసాద్: మలయాళ నటుడు (మే 2, 2025)
రవికుమార్ మీనన్: దక్షిణ భారత నటుడు (ఏప్రిల్ 4, 2025)
సరిగమ విజి: కన్నడ హాస్య నటుడు (జనవరి 15, 2025).
శివ శక్తి దత్త – ప్రముఖ సినీ రచయిత (కీరవాణి తండ్రి) జూలై 7, 2025
రాజేశ్ – తమిళ సీనియర్ నటుడు (గుండెపోటు) (మే 29, 2025)
సరిగమ విజి – కన్నడ హాస్య నటుడు (జనవరి 15, 2025) తదితరులు ఈ ఏడాది తమ తుదిశ్వాస విడిచారు.