Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja saab). పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇప్పటికే షేర్ చేసిన రాజాసాబ్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మారుతి టీం. రాజాసాబ్ క్లైమాక్స్ 35-40 నిమిషాలుంటుందని చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. పాట తర్వాత క్లైమాక్స్ మొదలువుతుంది. చాలా విషయాలు జరుగుతుంటాయి.
సినిమా కథనంలోని కీలక విషయాలను చూపించే క్రమంలోయాక్షన్, డ్రామా సన్నివేశాలతో క్లైమాక్స్ ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ చాలా నీట్‌గా ఉండటంతో ఎలాంటి సాగదీసిన ఫీలింగ్ అనిపించదు. ప్రేక్షకులు పరకాయ ప్రవేశం చేసేలా క్లైమాక్స్ ఉంటుంది.. అందరిని ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పుకొచ్చాడు. ఇపుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.