Tollywood 2025 | ప్రతీ యేటా టాలీవుడ్లో డిఫరెంట్ జోనర్లో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద తమ మార్క్ చూపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తాయి. 2025లో అత్యధిక గ్రాస్ సాధించి నిర్మాతలకు కాసులు కురిపించిన టాప్ 5 తెలుగు సినిమాలపై ఓ లుక్కేస్తే..
ఓజీ..
They call him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఓజీ (OG). సుజిత్ డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా రూ.302 కోట్లు గ్రాస్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
సంక్రాంతికి వస్తున్నాం..
Sankranthiki Vasthunam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ (Venkatesh) లీడ్ రోల్లో నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీ రూ.280 కోట్ల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచింది.
గేమ్ ఛేంజర్..
Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయనప్పటికీ రూ.197 కోట్లు గ్రాస్ సాధించి మూడో స్థానంలో నిలువడం విశేషం.
మిరాయి..
Mirai | హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja)నటించిన చిత్రం మిరాయి (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీ రూ.142 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగో తెలుగు చిత్రంగా నిలిచింది. ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్ర పోషించాడు.
కుబేర..
Kuberaa | కోలీవుడ్ యాక్టర్ ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కుబేర (Kubera).శేఖర్ కమ్ముల దర్శకత్వంలోసోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న గ్రాండ్‌గా విడుదలైంది.ఈ చిత్రం రూ.138 కోట్ల గ్రాస్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది.
కుబేర చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటించాడు. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కించారు.