Kalyani menon | సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. సినీ ప్రముఖుల వార్తలు ఇండస్ట్రీని కలచివేస్తున్నాయి. తాజాగా ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ప్రియురాలు పిలిచింది సినిమా దర్శకుడు రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి మీనన్.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 100కు పైగా పాటలు పాడారు కళ్యాణి. నేపథ్య గాయనిగా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఈమె. 1979లో ఇళయరాజా స్వర కల్పనలో వచ్చిన నల్లతోరు కుటుంబం ఈ సినిమాతో గాయనిగా పరిచయమయ్యారు కల్యాణి. ఆ తర్వాత ప్రేమికుడు, ముత్తు, సఖి ఇలా ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు ఈమె. 2000 సంవత్సరంలో రెహమాన్ ప్రత్యేకంగా స్వరపరిచిన వందేమాతరం ఆల్బమ్‌లోని ఒక పాట కూడా ఆలపించారు. సినిమా పాటల కంటే కూడా శాస్త్రీయ సంగీతంలో ఈమెకు ఎక్కువగా ప్రవేశముంది. మరీ ముఖ్యంగా భక్తి పాటలు ఆలపించడంలో కళ్యాణి మీనన్ దిట్ట. 2010లో భక్తి సంగీత రంగంలో చేసిన కృషికి మెచ్చి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. అలాగే కేరళ సంగీతం నుంచి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు కళ్యాణి.
Heartfelt condolences on the passing away of the noted singer Kalyani Menon. May her soul rest in peace. 🙏#KalyaniMenon #KSChithra @DirRajivMenon pic.twitter.com/HnUz963brC
— K S Chithra (@KSChithra) August 2, 2021
కళ్యాణి మీనన్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఏ ఆర్ రహమాన్, చిత్ర వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు నివాళులర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రిపుల్ ఆర్ కోసం కీరవాణి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్