Akhanda 2 | తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో టాప్‌లో ఉంటుంది అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) క్రేజీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ సినిమాతో టాలీవుడ్ సీనియర్ నటి కూతురు సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరనే కదా మీ డౌటు. అలనాటి అందాల తార లయ కూతురు శ్లోక. అఖండ 2తో శ్లోక ఎంట్రీ దాదాపు ఫైనల్ అయిపోయినట్టేనని తెలుస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇదే నిజమైతే మరి శ్లోక కోసం బోయపాటి ఎలాంటి పాత్రను రెడీ చేశాయనేది ఆసక్తి నెలకొంది. ఈ అప్డేట్ అఫీషియల్ అయితే మాత్రం శ్లోక్కు గ్రాండ్ డెబ్యూ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సీక్వెల్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని రీసెంట్గా విడుదల చేసిన ప్రోమో చెప్పకనే చెబుతోంది. ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది అంటూ ప్రోమోలో బాలకృష్ణ చెబుతున్న డైలాగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి.
బోయపాటి అఖండ 2లో బాలకృష్ణను ఎలాంటి రౌద్రరూపంలో చూపిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఫస్ట్ పార్టులో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.
రిలీజ్ డేట్ ప్రోమో..
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!