Legend Saravanan | ది లెజెండ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శరవణన్ ఆరుళ్ (Legend Saravanan). హోం బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. ఈ బిజినెస్మెన్ కమ్ యాక్టర్ గరుడన్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దురై సెంథిల్ కుమార్ (Durai Senthilkumar)తో రెండో సినిమాను ప్రకటించాడని తెలిసిందే.
ఇంట్రెస్టింగ్ విషయాలు ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందట. అంతేకాదు ఇందులో శరవణన్‌తో రొమాన్స్ చేయబోయే భామ పేరు కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో ఆర్ఎక్స్ ఫేం పాయల్ రాజ్‌పుత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుంది. అంతేకాదు ఆండ్రియా జెర్మియా, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో నటించనున్నారని ఇన్సైడ్ టాక్.
భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కూడా ప్రారంభం కాగా.. శరవణన్ ఈ సారి కొంచెం గడ్డం పెంచి నయా లుక్‌లో సందడి చేయబోతున్నట్టు నెట్టింట చక్కర్లు కొడుతున్న స్టిల్స్ చెబుతున్నాయి. శరవణన్ ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
రెండో సినిమా లాంచ్..
#LegendsNext #NewGameStarted@Dir_dsk@onlynikil pic.twitter.com/nIvJxNDUkl
— Legend Saravanan (@yoursthelegend) June 24, 2024
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!